IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో కాసేపట్లో ( 2026, ఏప్రిల్ 9న) కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య పోరు జరగబోతుంది. ఉత్కంఠగా కొనసాగిన టాస్ ప్రక్రియలో లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ విజయం సాధించి, మొదట ఫీల్డింగ్ తీసుకున్నారు. వరుస ఓటములతో టోర్నీని ప్రారంభించిన కేకేఆర్ ఈ మ్యాచులో గెలవాలనే పట్టుదలతో ఉండగా.. గత మ్యాచులో హైదరాబాద్ పై గెలిచిన తర్వాత కోల్‌కతాపై విజయం సాధించాలని లక్నో టార్గెట్ గా పెట్టుకుంది.
లక్నో కెప్టెన్ రిషబ్ పంత్మాట్లాడుతూ.. గత మ్యాచ్‌లో గెలిచిన ఉత్సాహంతోనే ఈ మ్యాచులో బరిలోకి దిగుతున్నామని పేర్కొన్నాడు. ఈరోజు జట్టులో ఎలాంటి మార్పులు లేకుండానే ఆడబోతున్నామని చెప్పారు. తమ టాప్ ఆర్డర్ బ్యాటర్లపై పంత్ పూర్తి నమ్మకాన్ని వ్యక్తం చేశాడు.
కేకేఆర్ కెప్టెన్ రహానే మాట్లాడుతూ.. అనారోగ్యం కారణంగా గత మ్యాచ్‌కు దూరమైన సునీల్ నరైన్ తిరిగి జట్టులోకి రావడం కేకేఆర్‌కు పెద్ద ఊరట కలిగించే అంశం.. అయితే, గాయం కారణంగా స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఇంకా కోలుకోలేదు, అందుకే అతను ఈ మ్యాచ్‌కు కూడా దూరమయ్యాడని పేర్కొన్నాడు. ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ ఈరోజు బౌలింగ్ చేయబోతున్నాడని కెప్టెన్ అజింక్య రహానే స్పష్టం చేశాడు.
ఇరు జట్లు:
కోల్‌కతా నైట్ రైడర్స్: అజింక్యా రహానే (కెప్టెన్), ఫిన్ అలెన్, కామెరాన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ (వికెట్ కీపర్), రింకు సింగ్, రోవ్‌మన్ పావెల్, రమణదీప్ సింగ్, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్, నవదీప్ సైనీ, కార్తీక్ త్యాగి
ఇంపాక్ట్ ప్లేయర్స్: మనీష్ పాండే, వైభవ్ అరోరా, తేజస్వి దహియా, రాహుల్ త్రిపాఠి, టిమ్ సీఫెర్ట్
లక్నో సూపర్ జెయింట్స్: మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, రిషబ్ పంత్(కెప్టెన్/ వికెట్ కీపర్), నికోలస్ పూరన్, అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, మణిమారన్ సిద్ధార్థ్, అవేష్ ఖాన్, మహమ్మద్ షమీ, దిగ్వేష్ సింగ్ రాఠీ, ప్రిన్స్ యాదవ్
ఇంపాక్ట్ ప్లేయర్స్: ఆయుష్ బదోని, మాథ్యూ బ్రీట్జ్కే, షాబాజ్ అహ్మద్, మయాంక్ యాదవ్, హిమ్మత్ సింగ్
🚨 Toss 🚨@LucknowIPL won the toss and elected to bowl first against @KKRiders
— IndianPremierLeague (@IPL) April 9, 2026
Updates ▶️ https://t.co/ov5gAlAtPH #TATAIPL | #KhelBindaas | #KKRvLSG pic.twitter.com/lUmM8nQLo5
